శ్రీలీల స్పెషల్ సాంగ్ సెన్సేషన్
పుష్ప2 ది రూల్ మూవీ సాంగ్ రిలీజ్
చెన్నై – నటి శ్రీలీల దుమ్ము రేపుతోంది. ఒకే ఒక్క పాటతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. చెన్నై వేదికగా జరిగిన పుష్ప2 ది రూల్ మూవీకి సంబంధించి కిస్సిక్ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. మొత్తంగా ఈ కార్యక్రమానికి హైలెట్ గా మారారు శ్రీలీల. ఐకాన్ స్టార్ గా పేరు పొందిన అల్లు అర్జున్ తో పోటీ పడి నటించింది . యువత గుండెలను తన డ్యాన్సులతో ఆకట్టుకుంటోంది.
ఇదిలా ఉండగా ఊ అంటావా అంటూ పుష్ప రాజ్ లో ఒక ఊపేసింది నటి సమంత రుత్ ప్రభు. ఇప్పుడు ఆమెను డామినేట్ చేస్తూ పోటీ పడి నటించింది లవ్లీ బ్యూటీ శ్రీలీల. నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డును స్వంతం చేసుకున్న గేయ రచయిత చంద్రబోస్ మరోసారి తన కలాన్ని జులిపించారు.
కిస్సిక్ అంటూ ప్రత్యేకమైన పాటను రాశారు. దీనికి స్వరకర్త రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. తను అద్భుతమైన బాణీ అందించారు. ఇప్పుడు ఈ పాట ట్రెండింగ్ లో కొనసాగుతోంది. వచ్చే నెల డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 6,500 సినిమా థియేటర్లలో పుష్ప 2 ది రూల్ మూవీని విడుదల చేయనున్నారు.
ఇక విడుదల కాకుండానే రికార్డ్ మోత మోగించింది ఈ మూవీ. ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసిందని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రం మరింతగా కాసులు తెచ్చి పెడుతుందని నమ్మకంతో ఉన్నారు.