ENTERTAINMENT

శ్రీ‌లీల స్పెష‌ల్ సాంగ్ వైర‌ల్

Share it with your family & friends

చెన్నైలో పుష్ప‌2 ది రూల్ ఈవెంట్

త‌మిళ‌నాడు – ఊ అంటావా అంటూ పుష్ప రాజ్ లో ఒక ఊపేసింది న‌టి స‌మంత రుత్ ప్ర‌భు. ఇప్పుడు ఆమెను డామినేట్ చేస్తూ పోటీ ప‌డి న‌టించింది ల‌వ్లీ బ్యూటీ శ్రీ‌లీల‌. నాటు నాటు పాట‌తో ఆస్కార్ అవార్డును స్వంతం చేసుకున్న గేయ ర‌చ‌యిత చంద్ర‌బోస్ మ‌రోసారి త‌న క‌లాన్ని జులిపించారు. కిస్సిక్ అంటూ ప్ర‌త్యేక‌మైన పాట‌ను రాశారు. దీనికి స్వ‌ర‌క‌ర్త రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్. త‌ను అద్భుత‌మైన బాణీ అందించారు. ఇప్పుడు ఈ పాట ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది.

ఇవాళ ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు చెన్నై వేదిక‌గా. వ‌చ్చే నెల డిసెంబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా ఏకంగా 6,500 సినిమా థియేట‌ర్ల‌లో పుష్ప 2 ది రూల్ మూవీని విడుద‌ల చేయ‌నున్నారు. ఇక విడుద‌ల కాకుండానే రికార్డ్ మోత మోగించింది ఈ మూవీ. ఏకంగా రూ. 1000 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింద‌ని టాక్. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రం మ‌రింతగా కాసులు తెచ్చి పెడుతుంద‌ని న‌మ్మ‌కంతో ఉన్నారు.

తెలుగు సినిమా రేంజ్ ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన రాజ‌మౌళికి ధీటుగా సుకుమార్ పుష్ప‌రాజ్ ఉండ‌బోతోంద‌ని ఫ్యాన్స్ అంచ‌నా. ఇది ప‌క్క‌న పెడితే ప్ర‌స్తుతం ల‌వ్లీ బ్యూటీ శ్రీ‌లీల ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. కిస్సిక్ సాంగ్ తో బ‌న్నీతో పోటీ ప‌డి న‌టించింది. ఇందుకు సంబంధించిన చిత్రాలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.