శ్రీలీల బన్నీ కెవ్వు కేక
పుష్ప మూవీపై ఉత్కంఠ
హైదరాబాద్ – మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , ఫాసిల్ నటించిన పుష్ప -2 మూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ఇప్పటికే బీహార్ రాజధాని పాట్నా వేదికగా వేలాది మంది సమక్షంలో విడుదల చేసిన మూవీ ట్రైలర్ దుమ్ము రేపుతోంది. ఏకంగా ఒకే రోజులో 5 కోట్ల మంది వీక్షించారు. ఇది ఓ రికార్డ్ అని చెప్పక తప్పదు.
ఇంకా రిలీజ్ కాకుండానే పుష్ప 2 మూవీ రూ. 1,000 కోట్లు వసూలు చేసింది. విడుదలయ్యాక దాదాపు రూ. 2,000 కోట్లకు పైగా వసూలు చేయనుందని సినీ విమర్శకులు, విశ్లేషకులు. ఇక రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన సత్తా ఏమిటో చూపించాడు. పుష్ప -1 ఇప్పటికే వసూళ్లలో రికార్డుల మోత మోగించింది. గేయ రచయిత చంద్రబోస్ మరోసారి తన కలాన్ని ఝులిపించారు. పుష్ప, సూసేటి అన్న పాటలు కూడా చంద్రబోస్ రాసినవే. ఈ రెండు సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
ఇక సుకుమార్ దర్శకత్వంలో తీసే సినిమాలలో ఐటం సాంగ్ తప్పక ఉంటుంది. పుష్ప-1లో ఊ అంటావా సాంగ్ దేశాన్ని ఊపేసింది. ఇందులో నటించిన సమంత కిర్రాక్ తెప్పించింది. ప్రస్తుతం పుష్ప-2 మూవీలో ప్రత్యేక పాటలో లవ్లీ గర్ల్ శ్రీలీల ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.