హైదరాబాద్ దెబ్బ చెన్నై అబ్బా
ఐపీఎల్ లో ధోనీకి బిగ్ షాక్
హైదరాబాద్ – హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన కీలకమైన లీగ్ పోరులో దుమ్ము రేపింది సన్ రైజర్స్ హైదరాబాద్ . ఈ లీగ్ లో భారీ స్కోర్ సాధించిన ఎస్ ఆర్ హెచ్ ఊహించని రీతిలో రెచ్చి పోయింది. బలమైన ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది.
డిఫెండింగ్ ఛాంపియన్ చేతులెత్తేసింది. హైదరాబాద్ టీం ఇటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లో సత్తా చాటింది. ముందుగా టాస్ గెలవడం ఎస్ ఆర్ హెచ్ కు మేలు చేకూర్చింది. ప్రధానంగా డొమెస్టిక్ క్రికెట్ లో సత్తా చాటిన దేశీయ కుర్రాళ్లు దంచి కొడుతున్నారు.
సొంత గడ్డపై పూర్తిగా ఆధిపత్యం వహించింది ఎస్ ఆర్ హెచ్. అభిషేక్ శర్మ రెచ్చి పోతే మార్క్రమ్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఇద్దరూ తమ జట్టు గెలుపులో కీలకంగా మారారు. చెన్నైపై 6 వికెట్ల తేడాతో హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది.
అంతకు ముందు టాస్ ఓడి పోవడం చెన్నైకి షాపంగా మారింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 రన్స్ మాత్రమే చేసింది. శివమ్ దూబే శివమెత్తాడు. 24 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 4 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 45 రన్స్ చేశాడు. అజింక్యా రహానే 35 రన్స్ చేసి రాణించాడు.
అనంతరం బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో మార్క్రమ్ 36 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు ఒక సిక్స్ తో 50 రన్స్ చేస్తే అభిషేక్ శర్మ 12 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 4 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు.