SPORTS

ఐపీఎల్ మ్యాచ్ కు ఉప్ప‌ల్ సిద్దం

Share it with your family & friends

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌ర్సెస్ ముంబై ఇండియ‌న్స్

హైద‌రాబాద్ – ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ 2024లో భాగంగా కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ కు హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ స్టేడియం సిద్దమైంది. ఇవాళ కీల‌క‌మైన పోరు కొన‌సాగ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ చీఫ్ జ‌గ‌దీశ్వ‌ర్ రావు సార‌థ్యంలో ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేశారు.

ఈ కీల‌క పోరు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ , ముంబై ఇండియ‌న్స్ మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ఇరు జ‌ట్లు స‌రి స‌మానంగా ఉన్నాయి. ముంబైకి హార్దిక్ పాండ్యా సార‌థ్యం వ‌హిస్తుండ‌డం విశేషం . ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తే సంజూ శాంస‌న్ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టాప్ లో కొన‌సాగుతోంది. మెరుగైన ర‌న్ రేట్ తో ఉంది. ఆ జ‌ట్టు బ‌ల‌మైన రాహుల్ సార‌థ్యంలోని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ను ఓడించింది 20 ప‌రుగుల తేడాతో.

ఇదిలా ఉండ‌గా ఉప్ప‌ల్ లో జ‌రిగే లీగ్ మ్యాచ్ కు భారీ భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. 2,800 మంది పోలీసులతో 300 సీసీ కెమెరాల‌తో భారీ బందోబ‌స్తు చేప‌ట్టారు. ల్యాప్ టాప్స్ , బ్యానర్లు, పెన్నులు, హెల్మెట్‌లకు స్టేడియంలో అనుమతి లేదని స్ప‌ష్టం చేశారు హెచ్ సీ ఏ చైర్మ‌న్.