SPORTS

హైద‌రాబాద్ జోరుకు ఆర్సీబీ బ్రేక్

Share it with your family & friends

క్రిక్కిరిసి పోయిన ఉప్ప‌ల్ స్టేడియం

హైద‌రాబాద్ – ఐపీఎల్ 2024లో ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపిస్తూ భారీ స్కోర్ సాధిస్తూ ఫోర్లు, సిక్స‌ర్ల‌తో ప‌రుగుల వర‌ద పారిస్తూ వ‌స్తున్న స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఎక్క‌డా ఆ జ‌ట్టు ఆట‌గాళ్ల‌ను ప‌రుగులు తీసేందుకు ఛాన్స్ ఇవ్వ‌లేదు. అత్యంత క‌ట్టుదిట్ట‌మైన బంతుల‌తో విల విల లాడేలా చేసింది.

మైదానంలోకి వ‌స్తూనే దాడి చేసే హైద‌రాబాద్ బ్యాట‌ర్లు సింగిల్స్ తీసేందుకు సైతం ఇబ్బందులు ప‌డ్డారు. మొత్తంగా ఆర్బీసీ బౌల‌ర్ల ధాటికి ఎస్ ఆర్ హెచ్ త‌ల‌వంచ‌క త‌ప్ప‌లేదు. ఇక ఆట విష‌యానికి వ‌స్తే హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ స్టేడియం పూర్తిగా నిండి పోయింది. కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో వ‌రుస ప‌రాజ‌యాల‌తో తీవ్ర నిరాశ‌లో ఉన్న ఆర్సీబీ ఎలాగైనా గెల‌వాల‌నే ల‌క్ష్యంతో ఆడింది. ఆ మేర‌కు స‌క్సెస్ అయ్యింది.

విచిత్రం ఏమిటంటే ఈ సీజ‌న్ లో ఆరు ఓట‌ముల త‌ర్వాత గెలిచింది ఇది ఒక్క‌టే. ఇప్ప‌టికే ఆ జ‌ట్టు ప్లే ఆఫ్స్ నుంచి దాదాపుగా నిష్క్ర‌మించిన‌ట్టే. ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 207 ర‌న్స్ చేసింది. ర‌జిత్ పాటిదార్ దుమ్ము రేపితే విరాట్ కోహ్లీ క్లాసిక‌ల్ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ 43 బంతుల్లో 4 ఫోర్లు ఒక సిక్స్ తో 51 ర‌న్స్ చేస్తే పాటిదార్ 20 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని హాఫ్ సెంచ‌రీ చేశాడు. ఇందులో 2 ఫోర్లు 5 సిక్స‌ర్లు ఉన్నాయి. కామెరూన్ 20 బాల్స్ ఆడి 5 ఫోర్ల‌తో 37 ర‌న్స్ చేసి నాటౌట్ గా మిగిలాడు.

ఇక హైద‌రాబాద్ విష‌యానికి వ‌స్తే 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 171 ర‌న్స్ కే ప‌రిమిత‌మైంది. షాబాజ్ అహ్మ‌ద్ 37 బంతులు ఎదుర్కొని 40 ర‌న్స్ తో నాటౌట్ గా మిగ‌ల‌గా అభిషేక్ శ‌ఱ్మ 31 , కెప్టెన్ క‌మిన్స్ 31 ర‌న్స్ చేసినా లాభం లేక పోయింది.