ఐపీఎల్ టికెట్ల దందా బట్టబయలు
ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్ – ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 2024 లో భాగంగా బ్లాక్ లో టికెట్ల దందాను బట్టబయలు చేశారు హైదరాబాద్ పోలీసులు. ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య కీలక లీగ్ మ్యాచ్ జరిగింది.
ఇందులో భాగంగా బీసీసీఐ , హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగింది హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ , నార్త్ జోన్ బృందం. గోపాలపురం పోలీసులతో కలిసి ఈ లీగ్ మ్యాచ్ కు సంబంధించి 100 ఐపీఎల్ టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చిత్తూరు రమణతో పాటు హైదరాబాద్ కు చెందిన డిజిటల్ మార్కెటర్ న్యాలకంటి శామ్యూల్ సుశీల్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి 100 ఐపీఎల్ టికెట్లతో పాటు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీటి మొత్తం విలువ రూ. 5,07,000 అని వెల్లడించారు.