SPORTS

రైజ‌ర్స్ రాణిస్తారా రాయ‌ల్స్ గెలుస్తారా

Share it with your family & friends

సంజూ శాంస‌న్ వ‌ర్సెస్ పాట్ క‌మిన్స్

హైద‌రాబాద్ – ఐపీఎల్ 2024లో అత్యంత కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ కు వేదిక కానుంది హైద‌రాబాద్ . మే 2వ తేదీ గురువారం సాయంత్రం ఉప్ప‌ల్ లోని రాజీవ్ గాంధీ మైదానంలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ , రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్లు త‌ల ప‌డ‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ టోర్నీలో అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకుంటోంది కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్.

ఇక పాట్ క‌మిన్స్ నేతృత్వంలోని స‌న్ రైజ‌ర్స్ ఊహించ‌ని రీతిలో పుంజుకుంది. ప్ర‌ధానంగా ఆ జ‌ట్టు రికార్డుల మోత మోగించింది. ప‌రుగుల వ‌ర‌ద పారించింది. దీంతో ఇవాళ జ‌రిగే ఈ మ్యాచ్ పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఇటు బౌలింగ్ లో అటు బ్యాటింగ్ లో దుమ్ము రేపుతోంది రాజ‌స్థాన్ రాయ‌ల్స్. ఆ జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు 9 మ్యాచ్ లు ఆడింది 8 మ్యాచ్ ల‌లో నెగ్గింది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో 16 పాయింట్లు సాధించి టాప్ లో నిలిచింది.

ఇక స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కేవ‌లం 5 మ్యాచ్ లు మాత్ర‌మే గెలుపొందింది. ఈ మ్యాచ్ ఆ జ‌ట్టుకు అత్యంత కీల‌కం. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే రాజ‌స్థాన్ పై గెలువాల్సి ఉంటుంది. హోం గ్రౌండ్ కావ‌డంతో స‌న్ రైజ‌ర్స్ కు అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ సంజూ శాంస‌న్ సేన‌ను త‌క్కువ అంచ‌నా వేస్తే బోల్తా ప‌డ‌డం ఖాయ‌మ‌ని క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు.