శ్రీ కాశీనాయన ఆరాధన మహోత్సవాలు
జ్యోతి క్షేత్రంలో ఘనంగా ఏర్పాట్లు
కడప జిల్లా – కడప జిల్లా శ్రీ అవదూత కాశినాయన మండలం జ్యోతి క్షేత్రంలో కాశినాయన 29వ ఆరాధనా మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈనెల 14, 15 తేదీలలో రెండు రోజుల పాటు శ్రీ కాశి నాయన మహోత్సవాలు నిర్వహించనున్నారు. 14న జ్యోతి ప్రజ్వలన , రథోత్సవం, అభిషేకం జరుగుతుంది. 15న పల్లకీ ఉత్సవం నిర్వంచనున్నట్లు తెలిపారు నిర్వాహకులు.
ఈ ఉత్సవాలకు సుమారు లక్ష మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా. వారందరికీ ఉచితంగా అన్నదానం కల్పించనున్నారు. రాయలసీమ, నెల్లూరు, గుంటూరు, ఒంగోలు జిల్లాలతో పాటు తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నారు.
ఇదిలా ఉండగా కాశీ నాయన ఒక ఆధ్యాత్మిక గురువు. స్వస్థలం నెల్లూరు జిల్లా బెడుసుపల్లి. గురువు అతిరాచ గురుయ్యచే ప్రభావితం అయ్యాడు. అనేక తీర్థ యాత్రలు చేశాడు. ఆయన జ్ఞాపకార్థం కడప జిల్లా నరసాపురం కేంద్రంగా కాశీ నాయన పేరిట రాష్ట్ర ప్రభుత్వం మండలాన్ని ఏర్పాటు చేసింది.
కాశీ నాయన పేరుతో కడప జిల్లాలో జ్యోతి క్షేత్రం వెలసింది. ఈ క్షేత్రం ఆళ్లగడ్డకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాడుబడిన ఆలయాలకు జీర్ణోద్ధరణ చేసి, అక్కడ ప్రతిరోజు అన్నదానం జరిగేలా కాశినాయన కృషి చేశారు.
కాశీ నాయన పేరు మీద తెలుగు నేల మీద దాదాపు 100కు పైగా ఆశ్రమాలు, గుళ్లు వెలిశాయి. గోశాలలతో పాటు నిత్య అన్నదానం కొనసాగుతోంది.