వెల్లడించిన టీటీడీ ఈవో శ్యామల రావు
తిరుపతి – తిరుపతిలోని శ్రీ కోదండ రామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 27 నుంచి ప్రారంభం అవుతాయని వెల్లడించారు టీటీడీ ఈవో జె. శ్యామల రావు. వచ్చే నెల ఏప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగుతాయయని తెలిపారు. మార్చి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 26న అంకురార్పణ జరుగుతుందన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి, సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. వాహన సేవలు ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 9.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు.
వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 8:30 గంటల వరకు నిర్వహిస్తారు. సేవల వివరాలు ఇలా ఉన్నాయి. 27న ఉదయం ధ్వజారోహణం (ఉదయం 9.15 నుండి 9.30 గంటల వరకు), రాత్రి పెద్దశేష వాహనం, 28న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం, 29న
ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం, 30న ఉదయం కల్పవృక్ష వాహనం , రాత్రి సర్వ భూపాల వాహనం, 31న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి గరుడ వాహనం నిర్వహిస్తామని తెలిపారు ఈవో.
ఏప్రిల్ 1వ తేదీన ఉదయం స్వామి వారు హనుమంత వాహనంపై , రాత్రి గజ వాహనంపై ఊరేగుతారని పేర్కొన్నారు. 2వ తేదీన ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 3వ తేదీన ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం, 4వ తేదీన ఉదయం చక్ర స్నానం, రాత్రి ధ్వజా రోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు శ్యామల రావు.