Sunday, April 20, 2025
HomeDEVOTIONALకోదండ రాముడి ప‌విత్రోత్స‌వాలు

కోదండ రాముడి ప‌విత్రోత్స‌వాలు

ఉత్స‌వాల‌కు పోటెత్తిన భ‌క్తులు

తిరుప‌తి – తిరుప‌తిలో ప్ర‌సిద్ది చెందిన పుణ్య క్షేత్రంగా పేరు పొందిన శ్రీ‌ కోదండ రామ స్వామి వారి ఆలయంలో జూలై 31 నుండి ఆగష్టు 2వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.

ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటల నుండి సేనాధిపతి ఉత్సవం, మేధిని పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ ఘట్టాలు నిర్వహించారు. యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు.

పవిత్రోత్సవాల్లో భాగంగా జూలై 31వ తేదీ యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, ఆగష్టు 1న పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగష్టు 2న యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ‌ డెప్యూటీ ఈవో నాగ‌ర‌త్న‌, ఏఈవో పార్థసారథి, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు ఆనంద‌కుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్‌ శ్రీ సోమశేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments