ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి
దేశమంతటా సంబురాలు
ఢిల్లీ – దేశ మంతటా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘణంగా నిర్వహించారు. భగవానుడు శ్రీకృష్ణుడు పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆగస్టు 26న సోమవారం పుట్టిన రోజు వేడుకలను అంగరంగ వైభవోపేతంగా జరుపుతున్నారు. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
కృష్ణుడి జననం భాద్రపద మాసం చీకటి పక్షం (కృష్ణ పక్షం)లో ఎనిమిదవ రోజు (అష్టమి) జరుపుకుంటారు. ప్రతి ఏటా ఆగస్టు నెలలో నిర్వహిస్తారు. భగవానుడి పుట్టిన రోజును పర్వ దినంగా, పండుగ లాగా నిర్వహించడం కొన్ని తరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది.
కృష్ణుడి జీవితం గురించిన సమాచారం మహాభారతం. కృష్ణుడు దేవకి (తల్లి) , వసుదేవ (తండ్రి)ల ఎనిమిదవ కుమారుడు. కృష్ణుడు భారతదేశంలోని మథురలోని ఒక జైలులో జన్మించాడు, అక్కడ అతని తల్లిదండ్రులు అతని మేనమామ కంసుడితో నిర్బంధించబడ్డారు. కృష్ణుని పట్ల ప్రేమతో కూడిన భక్తిగీతాలు పాడడం, రాత్రిపూట జాగరణ చేయడం ద్వారా జన్మాష్టమని నిర్వహిస్తారు.
కృష్ణుని బాల్యం, యుక్త వయస్సు జీవితమంతా సవతి సోదరుడైన బలరాముడుతో గడిచింది. శ్రీకృష్ణుడి బోధనలను, గీతా సారాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఇష్కాన్ ప్రచారం చేస్తోంది. కోట్లాది మందిని ఇప్పటికే ప్రభావితం చేస్తోంది.
భగద్గీతను చదివిన వారు ఉన్నతమైన పదవులలో కొలువు తీరారు. మొత్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమిని ఇవాళ దేదీప్య మానంగా సాగుతోంది.