శ్రీలంక అధ్యక్షుడితో రష్యా రాయబారి భేటీ
అనుర కుమార దిస్సనాయకేకు కంగ్రాట్స్
శ్రీలంక – శ్రీలంక నూతన అధ్యక్షుడిగా నియమితులైన అనుర కుమార దిస్సనాయకేకు ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఆయనను మంగళవారం మర్యాద పూర్వకంగా అమెరికా దేశానికి చెందిన రాయబారి జూలీ చుంగ్ భేటీ అయ్యారు. అనంతరం అమెరికాతో పోటీ పడుతున్న రష్యా దేశపు రాయబారి మిస్టర్ లెవాన్ ఎస్ జగర్యాన్ అనుర కుమార దిస్సనాయకేతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శ్రీలంక అధ్యక్షుడిని సెక్రటేరియట్ లో కలుసుకుని కీలక అంశాలపై చర్చించారు. రాయబారి అనుర కుమార దిస్సనాయకేను అభినందించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుండి వ్యక్తిగత సందేశాన్ని అందించారు, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించాలని ఆశాభావం వ్యక్తం చేశారని తెలిపారు.
శ్రీలంక, రష్యాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంపై చర్చ జరిగింది. వాణిజ్యం, పెట్టుబడులు, సంస్కృతి, విద్య వంటి కీలక రంగాలలో సహకారాన్ని పెంచుకుంటూ దౌత్య సంబంధాలను మెరుగు పరచుకోవడంలో తమ నిబద్ధతను ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి, ఈ రంగాలలో అభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పాయి.