NEWSNATIONAL

పీఎం ప్ర‌మాణానికి దేశాధిప‌తులు

Share it with your family & friends

మూడోసారి కొలువు తీర‌నున్న మోడీ

న్యూఢిల్లీ – న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీ చ‌రిత్ర సృష్టించ‌నున్నారు. భార‌త దేశ చ‌రిత్ర‌లో దివంగ‌త ప్ర‌ధాన మంత్రి జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ మూడుసార్లు ప్ర‌ధాన‌మంత్రిగా ప‌ని చేశారు. ఆదివారం ముహూర్తం నిర్ణ‌యించింది ఎన్డీయే – భార‌తీయ జ‌న‌తా పార్టీ. పార్ల‌మెంట‌రీ స‌మావేశంలో న‌రేంద్ర మోడీని త‌మ నాయ‌కుడిగా ఎన్నుకున్నారు. ఏక‌గ్రీవంగా తీర్మానం చేశారు.

ఈ మేర‌కు 75 ఏళ్ల స్వ‌త్రంత భార‌తంలో నెహ్రూ రికార్డ్ ను చెరిపేయ‌నున్నారు మోడీ. ఇదిలా ఉండ‌గా ఇవాళ దేశ రాజ‌ధానిలో జ‌రిగే ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ప్రపంచంలోని ప‌లు దేశాల‌కు చెందిన అధిప‌తులు హాజ‌రు కానున్నారు.

హాజ‌ర‌య్యే వారిలో శ్రీ‌లంక దేశ అధ్య‌క్షుడు రణిల్ విక్ర‌మ్ సింఘే , మాల్దీవుల్ చీఫ్ డాక్ట‌ర్ మొహ‌మద్, సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మ‌ద్ హ‌ఫీస్ , బంగ్లాదేశ్ ప్ర‌ధాన మంత్రి షేక్ హ‌సీనా, మారిష‌స్ పీఎం ప్ర‌వింద్ కుమార్ జ‌గ‌న్నాథ్ , నేపాల్ ప్ర‌ధాని పుష్ప కమ‌ల్ ద‌హ‌ల్ ప్ర‌చండ‌, భూటాన్ పీఎం షెరింగ్ టోబ్గే హాజ‌రు కానున్నారు.