మహిళా ఆసియా కప్ విజేత శ్రీలంక
దంబుల్లాలో 8 వికెట్ల తేడాతో గెలుపు
శ్రీలంక – శ్రీలంకలోని దంబుల్లాలో ఆదివారం జరిగిన కీలకమైన మహిళా ఆసియా కప్ 2024 ను ఆతిథ్య శ్రీలంక మహిళా జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది 6 వికెట్లు కోల్పోయి.
అనంతరం 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మహిళా జట్టు అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది. ఆ జట్టు కెప్టెన్ చమరి అతపత్తు , హర్షిత సమర విక్రమ సూపర్ షో చేశారు. భారత మహిళా బౌలర్లకు చుక్కలు చూపించారు. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి అనుకున్న లక్ష్యాన్ని సులువుగా ఛేదించారు. ఆసియా కప్ విజేతగా నిలిచారు.
ఇదిలా ఉండగా శ్రీలంక విమెన్ టీమ్ తొలిసారిగా ఆసియా కప్ ను గెలుపొంది చరిత్ర సృష్టించింది. ఒక రకంగా టోర్నీలో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది టీమిండియా. కానీ ఫైనల్ లో చతికిల పడింది. స్మృతీ మంధాన, రిచా అద్బుతంగా ఆడారు. మంధాన 60 రన్స్ చేస్తే రిచా 30 పరుగులు చేశారు.
మ్యాచ్ పరంగా చూస్తే శ్రీలంక ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. అయితే మైదానంలోకి వచ్చిన కెప్టెన్ చమరి 49 బంతుల్లో 61 రన్స్ చేసింది. హర్షిత్ అతపత్తు 51 బంతులు ఎదుర్కొని 69 రన్స్ చేసింది. ఇద్దరూ నాటౌట్ గా నిలిచారు. కవిషా దిల్హరి 16 బంతులు ఎదుర్కొని 30 రన్స్ చేసింది. కాగా ఇప్పటి వరకు ఏడుసార్లు ఆసియా కప్ ను కైవసం చేసుకున్న భారత జట్టు ఎనిమిదో టైటిల్ ను కోల్పోయింది.