శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు
ఉత్సవాలలో వాహన సేవల వివరాలు
తిరుపతి – తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఇప్పటికే భారీ ఎత్తున టీటీడీ ఏర్పాట్లు చేసింది. పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకోనున్నారు అమ్మ వారిని. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి రానున్నారు. కార్తీక బ్రహ్మోత్సవాలలో పాల్గొంటే అష్ట అయిశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. భక్తుల విశ్వాసం.
ఇదిలా ఉండగా శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్బంగా వాహన సేవల వివరాలు వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం. జేఈవో వీరబ్రహ్మం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
తేది సమయం – వాహన సేవలు
28.11.2024 ఉ. 9.00 – ఉ.9.30 ధ్వజారోహణము
రాత్రి 7.00 – 9.00 చిన్నశేష వాహనము
29.11.2024 ఉ. 8 – 10 పెద్దశేష వాహనము
రా.7 – 9 హంస వాహనము
30.11.2024 ఉ. 8 – 10 ముత్యపు పందిరి వాహనము
రా. 7- 9 సింహ వాహనము
01.12.24 ఉ. 8 – 10 కల్పవృక్ష వాహనము
రా. 7 – 9 హనుమంత వాహనము
02.12.24 ఉ. 8 – 10 పల్లకి వాహనము
రా. 7 – 9 గజ వాహనము
03.12.24 ఉ. 8 – 10 సర్వభూపాల వాహనము
సా.4.20 – 5.20 స్వర్ణ రథోత్సవము
రా. 7 – 9 గరుడ వాహనము
04.12.24 ఉ. 8 – 10 సూర్య ప్రభ వాహనము
రా. 7 – 9 చంద్రప్రభ వాహనము
05.12.24. ఉ. 8 – 10 రథోత్సవము
రా. 7 – 9 అశ్వవాహనము
06.12.24 ఉ. 7 – 8 పల్లకీ ఉత్సవము
మ.12.15 – 12.20 పంచమి తీర్థము, రాత్రి: ధ్వజావరోహణం
07.12.2024 : సాయంత్రం – పుష్పయాగంతో ముగుస్తాయి ఈ బ్రహ్మోత్సవాలు.