హంస వాహనంపై సిరుల తల్లి
సరస్వతి అలంకారంలో పద్మావతి
తిరుపతి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంస వాహనంపై సరస్వతి అలంకారంలో అమ్మ వారు భక్తులకు దర్శనమిచ్చారు. డిసెంబర్ 6వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయని వెల్లడించారు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం. తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అమ్మ వారిని దర్శించు కునేందుకు భక్తులు పోటెత్తారు.
విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాలను, నీటిని వేరు చేయగలగడం. అలాగే యోగి పుంగవులు జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలగుతారు. అలాంటి మహా యోగి పుంగవుల హృదయాలలో జ్ఞాన స్వరూపిణియైన అలివేలు మంగమ్మ విహరిస్తూ ఉంటుందని భక్తుల నమ్మకం.
మేలుమంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీ దేవిని ఉపాసించే సాధకులు ”హంస వాహన సంయుక్తా విద్యాదానకరీ మమ” అని ఆ తల్లిని ఆరాధిస్తారు.
వాహన సేవలో ఈవో జె.శ్యామలరావు, జేఈవోలు వీరబ్రహ్మం, గౌతమి, ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, ఆలయ అర్చకులు బాబు స్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు సుభాష్, చలపతి పాల్గొన్నారు.