DEVOTIONAL

శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

Share it with your family & friends

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో
తిరుప‌తి – తిరుప‌తిలోని ప్ర‌ముఖ పుణ్య క్షేత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయంలో అంగ‌రంగ వైభ‌వోపేతంగా ప‌విత్రోత్స‌వాలు జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది.

ఉదయం సుప్రభాతంతో అమ్మ వారిని మేల్కొలిపి సహస్ర నామార్చన, నిత్యార్చ‌న‌ చేపట్టారు. ఆ తరువాత ఉద‌యం 11.30 గంటల నుండి పవిత్ర సమర్పణ నిర్వ‌హించారు.

ఇందులో అమ్మ వారి మూల మూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, ప‌రివార దేవ‌త‌ల‌కు, విమాన ప్రాకారానికి, ధ్వజ స్తంభానికి పవిత్రాలు సమర్పించారు.

కాగా, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు ఘ‌నంగా.

ఈ కార్య‌క్ర‌మంలో చంద్రగిరి ఎంఎల్ఏ పులివర్తి నాని దంపతులు, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం దంపతులు, ఆల‌య డెప్యూటీ ఈవో గోవింద రాజన్, ఏఈవో రమేష్, అర్చ‌కులు బాబు స్వామి, సూప‌రింటెండెంట్ శేష‌గిరి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ సుభాష్, గణేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.