DEVOTIONAL

ఘ‌నంగా శ్రీ‌రామ ప‌ట్టాభిషేకం

Share it with your family & friends

కోదండ రాముడి ఆల‌యంలో

తిరుప‌తి – తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం రాత్రి శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ఉత్సవ మూర్తులను ఊంజల్ మండపానికి వేంచేపు చేశారు. అనంతరం నరసింహ తీర్థం నుండి తెచ్చిన తీర్థంతో శ్రీకోదండ రామునికి అభిషేకం చేశారు.

ఉదయం 9 నుండి 11 గంటల వరకు యాగశాలలో అగ్ని ప్రతిష్ట, చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. రాత్రి 7 గంటల నుండి శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరిగింది. రాత్రి 8.30 గంటలకు బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామ లక్ష్మణులు, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయ స్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శన భాగ్యం క‌ల్పించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, అదనపు ఎఫ్ ఏ అండ్ సిఏఓ రవి ప్రసాదు, ఏఈవో పార్థ‌సార‌థి, సూపరింటెండెంట్‌ సోమ‌శేఖ‌ర్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.