DEVOTIONAL

టీటీడీకి సీఎఫ్ఓ కోటిన్న‌ర‌ విరాళం

Share it with your family & friends

చెక్కును ఈవోకు అంద‌జేసిన భ‌క్తుడు

తిరుమ‌ల – తిరుమ‌ల‌లో కొలువు తీరిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామికి ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది భ‌క్తులు ఉన్నారు. నిత్యం విరాళాలు స‌మ‌ర్పిస్తూ వ‌స్తున్నారు. శుక్ర‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని తెనాలికి చెందిన అప‌ర భ‌క్తుడు స‌త్య శ్రీ‌నివాస్ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి జె. శ్యామ‌ల రావును క‌లుసుకున్నారు.

ఈ సంద‌ర్బంగా త‌న వంతు బాధ్య‌త‌గా కోటిన్న‌ర రూపాయ‌ల‌ను విరాళంగా ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించి చెక్కును ఈవోకు అంద‌జేశారు. ఆయ‌న ప్ర‌స్తుతం నేష‌న‌ల్ స్టీల్స్ ప్రాజెక్టుకు చీఫ్ ఫైనాన్షియ్ ఆఫీస‌ర్ గా ప‌ని చేస్తున్నారు. త‌ను ముందు నుంచీ శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను కొలుస్తూ వ‌స్తున్నారు.

త‌న కుటుంబం ప్ర‌శాంతంగా, ఆయురారోగ్యాల‌తో , సుఖ సంతోషాలతో ఉండేందుకు ఆ క‌లియుగ వేంక‌టేశ్వ‌రుడే కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. తాను సంపాదించిన దాంట్లోంచి వ‌చ్చిన దానిని కొంత మేర కోటిన్న‌ర రూపాయ‌ల‌ను ప్రాణ దాన ట్ర‌స్టుకు విరాళంగా ఇస్తున్న‌ట్లు తెలిపారు దాత స‌త్య శ్రీ‌నివాస్.