DEVOTIONAL

ర‌హీం సూఫీని క‌లిసిన చినజీయ‌ర్ స్వామి

Share it with your family & friends

క‌లిసిన ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ష‌బ్బీర్ అలీ

హైద‌రాబాద్ – ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన జీయ‌ర్ స్వామీజీ వైర‌ల్ గా మారారు. సామాజిక మాధ్య‌మాల‌లో ఆయ‌న సంచ‌ల‌నం కావ‌డం విశేషం. నిత్యం హిందూ, ముస్లింల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతున్న త‌రుణంలో మ‌త సామ‌ర‌స్యం పెంపొందంచే విధంగా దృష్టి సారించారు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన‌జీయ‌ర్ స్వామీజీ.

గ‌త కొంత కాలం నుంచీ స‌ర్వ మ‌త స‌మ్మేళ‌నాల‌ను నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు స్వామీజీ. ఇదిలా ఉండ‌గా హైద‌రాబాద్ కు చెందిన ప్ర‌ముఖ సూఫీ ర‌హీం నివాసానికి స్వ‌యంగా విచ్చేశారు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన జీయ‌ర్ స్వామీజీ. వారిని సాద‌రంగా ఆహ్వానించారు ర‌హీం సూఫీ.

ముస్లింలు, హిందువులు, క్రిష్టియ‌న్లు, ఇత‌ర కులాలు, మ‌తాల వారంద‌రూ ఒక్క‌టేన‌ని, అంతా క‌లిసిక‌ట్టుగా ఉండాల‌ని బోధ‌న‌లు చేస్తూ వ‌స్తున్నారు ర‌హీం సూఫీ. ఆయ‌న‌ను త‌మ ప్ర‌తినిధిగా భావిస్తారు ముస్లింలు.

ఈ సంద‌ర్బంగా త‌న నివాసానికి వ‌చ్చిన స్వామీజీతో గంట‌కు పైగా చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇదే స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, మాజీ మంత్రి ష‌బ్బీర్ అలీ మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన జీయ‌ర్ స్వామీజీని. స్వామితో పాటు ర‌హీం సూఫీ ష‌బ్బీర్ అలీని ఆశీర్వ‌దించారు.