DEVOTIONAL

తిరుప‌తి ఎయిర్ పోర్టులో టీటీడీ కౌంట‌ర్

Share it with your family & friends

శ్రీ‌వాణి ట్ర‌స్ట్ డొనేష‌న్ కౌంట‌ర్ పునః ప్రారంభం

తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. మంగ‌ళ‌వారం ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించింది. టీటీడీ ఆధ్వ‌ర్యంలో శ్రీ‌వాణి ట్ర‌స్టు త‌ర‌పున విరాళాలు సేక‌రిస్తోంది. ఎవ‌రు డ‌బ్బులు చెల్లిస్తే వారికి టికెట్ల‌ను కేటాయిస్తుంది. బ్రేక్ ద‌ర్శ‌నం పేరుతో వారికి ద‌ర్శ‌నం చేయించే ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టింది. ఈవో ధ‌ర్మా రెడ్డి వ‌చ్చాక ఆదాయం పెంచే మార్గాల‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు.

ఓ వైపు టీటీడీ చైర్మ‌న్ సామాన్యుల‌కే పెద్ద పీట వేస్తున్నామ‌ని పేర్కొంటున్నా తిరుమ‌ల‌లో అదేమీ క‌నిపించ‌డం లేదు. ఇక అన్న‌దానం గురించి ఎంత చ‌ప్పినా త‌క్కువే. ఇదిలా ఉండ‌గా గ‌తంలో ప్ర‌వాస భార‌తీయుల కోసం తిరుప‌తి ఎయిర్ పోర్టులో టీటీడీ ఆధ్వ‌ర్యంలో శ్రీ‌వాణి ట్ర‌స్టు డొనేష‌న్ కంటౌర్ ఏర్పాటు చేశారు. కానీ ఉన్న‌ట్టుండి దానిని నిలిపి వేశారు.

తాజాగా టీటీడీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని , ఈ మేర‌కు ఈనెల 13 నుంచి తిరిగి శ్రీ‌వాణి ట్ర‌స్ట్ డొనేష‌న్ కౌంట‌ర్ ను పునః ప్రారంభిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. విమానయాన ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకు వ‌చ్చిన‌ట్లు తెలిపింది. భ‌క్తులు ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించు కోవాల‌ని కోరింది .