NEWSTELANGANA

కోరిన‌న్ని రోజులు అసెంబ్లీ నిర్వ‌హిస్తాం

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు

హైద‌రాబాద్ – ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తిప‌క్షాలు కోరిన‌న్ని రోజులు అసెంబ్లీ నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. వ్య‌క్తిగ‌తంగా తాము ఎవ‌రినీ వెళ్ల‌మ‌ని చెప్ప‌లేద‌న్నారు.

టీడీపీ, ఎంఐఎం, బీజేపీ నుంచి ఇద్దరు స‌భ్యుల చొప్పున రావాల‌ని కోరామ‌ని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, క‌డియం శ్రీ‌హ‌రి వ‌స్తార‌ని చెప్పార‌ని పేర్కొన్నారు. కేసీఆర్ స్థానంలో ఇంకొక‌రిని తీసుకు రావ‌చ్చ‌ని తాము స్ప‌ష్టం చేశామ‌న్నారు.

స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ నిర్ణ‌యం మేర‌కే బీఏసీ న‌డిచింద‌న్నారు. పార్టీలకు ముందుగా ఇప్ప‌టికే స‌మాచారం చేర వేయ‌డం జ‌రిగింద‌న్నారు దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు. స‌భ ఎన్ని రోజులంటే అన్ని రోజులు శాస‌న స‌భ‌, శాస‌న మండ‌లి నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. అన్ని అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని స్ప‌ష్టం చేశారు. మొత్తంగా ప్ర‌తిప‌క్షాలు చేసే ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు .