మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడి
హైదరాబాద్ – హైదరాబాద్‌ను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను గవర్నమెంట్ సేవల్లో వినియోగిస్తామని చెప్పారు.
హైదరాబాద్ అంటే కేవలం సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదని, గ్లోబల్ లీడర్లను అందించే హబ్ అని స్పష్టం చేశారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి ప్రభుత్వం ఎర్ర తివాచీ పరుస్తుందన్నారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతి ఇస్తామన్నారు.
తమ ప్రభుత్వం పూర్తిగా టెక్నాలజీ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు మంత్రి. పెద్ద ఎత్తున ఈ రంగం నుంచి ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోందన్నారు . ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు శ్రీధర్ బాబు.
అందుకే తమ సర్కార్ నైపుణ్యాభివృద్దిపై ఫోకస్ పెట్టామన్నారు. ప్రతి చోటా వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఏఐ నడుస్తోందని, దీనిని హైదరాబాద్ కేరాఫ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.