కేసీఆర్ వల్లనే తెలంగాణ అభివృద్ది
మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్
పాలమూరు జిల్లా – మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. ఇప్పటికే రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లవుతోంది. కొత్తగా బీఆర్ఎస్ పాలన పోయి సీఎం రేవంత్ రెడ్డి పాలన వచ్చింది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ పరేషాన్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముద్ర చెరిపేసేందుకు ప్రయత్నం చేస్తుండడంపై ఆరోపణలు చేస్తున్నాయి.
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ కారణంగానే తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ది జరిగిందన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు.
కేసీఆర్ చేసిన పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఏరికోరి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ను 10 ఏళ్లలో పూర్తి స్థాయిలో అభివృద్ది చేయడంపై ఫోకస్ పెట్టారని చెప్పారు శ్రీనివాస్ గౌడ్.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర చిహ్నాల మార్పు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.