మనోడికి విప్రో పగ్గాలు
సీఈవోగా శ్రీనివాస్ పల్లా
న్యూఢిల్లీ – ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రోకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఇండియాకు చెందిన శ్రీనివాస్ పల్లా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా టాప్ ఐటీ కంపెనీలకు మన భారతీయులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చైర్మన్లుగా, మేనేజింగ్ డైరెక్టర్లుగా, సీఇఓలు, సీఎఫ్ ఓలుగా కొలువు తీరారు. తాజాగా మరో భారతీయుడు పల్లా శ్రీనివాస్ వారి జాబితాలోకి చేరాడు.
ఈ శ్రీనివాస్ పల్లా ఎవరో కాదు మన తెలుగోడు . సీఇవోగానే కాకుండా విప్రో కార్యనిర్వాహక బోర్డు సభ్యుడు కూడా. ఈ సందర్భంగా ఆయన పరిశ్రమ రంగాల విస్తృత శ్రేణికి నాయకత్వం వహిస్తాడు. వృద్ది వ్యూహాలను రూపొందించేందుకు , అమలు చేసేందుకు ప్రయ్నతం చేయాల్సి ఉంటుంది.
విప్రో ఐటీ సంస్థలో శ్రీనివాస్ పల్లా 1992లో చేరాడు. ఆయన కొన్నేళ్లుగా వివిధ హోదాలలో పని చేస్తూ వచ్చారు. కన్స్యూమర్ బిజినెస్ యూనిట్ కు ప్రెసిడెంట్ గా ఉన్నారు. బిజినెస్ అప్లికేషన్ సర్వీసెస్ గ్లోబల్ హెడ్ తో సహా అనేక నాయకత్వ పదవులను నిర్వహించాడు. ఆయన తన పదవీ కాలం మొత్తం విప్రోను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించారు. విప్రో యాజమాన్యం, బోర్డు మొత్తం శ్రీనివాస్ పల్లా వైపు మొగ్గు చూపింది.