NEWSTELANGANA

‘క‌ర్రి’కి కాంగ్రెస్ స‌ర్కార్ కీల‌క ప‌ద‌వి

Share it with your family & friends

మీడియా అండ్ క‌మ్యూనికేష‌న్స్ డైరెక్ట‌ర్

హైద‌రాబాద్ – ఓ ప‌త్రిక‌కు ఎడిట‌ర్ గా పని చేస్తూనే సీఎం రేవంత్ రెడ్డి వెంట అధికారిక ప‌ర్య‌ట‌న‌లో పాల్గొని తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న శ్రీ‌రామ్ క‌ర్రికి కీల‌క ప‌ద‌వి ద‌క్కింది. ఆయ‌న అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు సీఎం టూర్ లో. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంద‌రో మేధావులు, మీడియా ప్రొఫెష‌నల్స్ ఉన్న‌ప్ప‌టికీ రేవంత్ రెడ్డి ఏరికోరి శ్రీ‌రాం క‌ర్రీని వెంట పెట్టుకుని వెళ్లారు.

బుధ‌వారం రాష్ట్ర ప్ర‌భుత్వం సీఎం ఆదేశాల మేర‌కు శ్రీ‌రామ్ క‌ర్రీకి కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది. ఈ మేర‌కు సీఎస్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వ మీడియా అండ్ క‌మ్యూనికేష‌న్స్ డైరెక్ట‌ర్ గా శ్రీ‌రామ్ క‌ర్రీని నియ‌మిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఇప్ప‌టికే కీల‌క ప‌ద‌వుల‌లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని నియ‌మించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఒడిశా ప్రాంతానికి చెందిన శ్రీ‌రామ్ క‌ర్రీకి పోస్ట్ ఇవ్వ‌డంపై భ‌గ్గుమంటున్నారు తెలంగాణ‌వాదులు. రోజు రోజుకు తెలంగాణ వాదం లేకుండా, ఈ ప్రాంతపు అస్త‌త్వానికి భంగం క‌లిగించేలా చ‌ర్య‌లు తీసుకుంటారేమోన‌న్న ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది.

ఏది ఏమైనా తెలంగాణ స‌మాజం దేనినైనా భ‌రిస్తుంది కానీ మోసాన్ని, ద‌గాను, దోపిడీని, అన్యాయాన్ని , ఆత్మ గౌర‌వాన్ని దెబ్బ తీస్తే మాత్రం స‌హించ‌దు. ఇది చ‌రిత్ర చెప్పిన స‌త్యం.