NEWSANDHRA PRADESH

వ‌ర‌ద ప్ర‌వాహం నిండు కుండ‌లా శ్రీ‌శైలం

Share it with your family & friends

ఏపీని వెంటాడుతున్న వ‌ర్షాలు..వ‌ర‌ద‌లు

క‌ర్నూలు జిల్లా – ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల తాకిడికి ఏపీలోని ప్రాజెక్టుల‌న్నీ నిండు కుండ‌ల‌ను త‌ల‌పింప చేస్తున్నాయి. వ‌ర‌ద‌ల తాకిడికి ఎక్క‌డిక‌క్క‌డ నీళ్లు వ‌స్తుండ‌డంతో ముందు జాగ్ర‌త్త‌గా నీళ్ల‌ను కింద‌కు వ‌దులుతున్నారు.

మ‌రో వైపు క‌ర్నూల్ జిల్లా లోని శ్రీశైలం జలాశయానికి వ‌ర‌ద ఉధృతి కొన‌సాగుతోంది. దీంతో 6 గేట్లు ఎత్తేశారు. 10 అడుగుల మేర ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేశారు ప్రాజెక్టు అధికారులు.

ఇదిలా ఉండ‌గా ప్రాజెక్టుకు సంబంధించి ఇన్‌ఫ్లో 1,92,415 క్యూసెక్కులు ఉండ‌గా ఔట్‌ఫ్లో 2,34,708 క్యూసెక్కులు ఉంది.

మ‌రో వైపు ఈ జ‌లాశ‌యం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.50 అడుగులు ఉంద‌ని అధికారులు వెల్ల‌డించారు. భారీగా నీరు చేరుకోవ‌డంతో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొన‌సాగుతోంది.