కేసు వాపసు తీసుకుంటున్నా – భాస్కర్
శ్రీతేజ్ కోలుకుంటున్నా గుర్తు పట్టడం లేదు
హైదరాబాద్ – సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కండీషన్ కొద్దిగా మేలు అన్నారు తండ్రి భాస్కర్. సంధ్య థియేటర్ లోపల ఏం జరిగిందో తనకు తెలియదని వాపోయాడు. మెరుగైన వైద్య సాయం చేస్తామని కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం చెప్పిందన్నారు .
ఇప్పటి వరకు బయట జరుగుతున్న ప్రచారం గురించి తనకు తెలియదన్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్నా కలిసి నటించిన పుష్ప మూవీ నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ తనకు మంత్రితో కలిసి రూ. 50 లక్షల చెక్కును అందించారని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో హీరో ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రూ. 10 లక్షలు మాత్రమే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఘటన చోటు చేసుకున్న తర్వాత రూ. 25 లక్షలు ఇచ్చామని చెప్పడం పూర్తిగా అబద్దమన్నారు శ్రీతేజ్ తండ్రి. అయితే రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూ. 25 లక్షలు ఇచ్చారని చెప్పారు.