Tuesday, April 22, 2025
HomeDEVOTIONALడిసెంబర్ 3న స్థానికులకు శ్రీవారి దర్శనం

డిసెంబర్ 3న స్థానికులకు శ్రీవారి దర్శనం

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి

తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. స్థానికుల‌కు ప్ర‌తి నెలా 3వ తేదీన శ్రీ‌వారి ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించాల‌ని బోర్డు తీర్మానం చేసింది. ఈ మేర‌కు డిసెంబర్ 2న తిరుపతి మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ నందు ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేయ‌నున్న‌ట్లు తెలిపింది టీటీడీ.

టిటిడి ధర్మకర్తల మండలి నవంబర్ 18న జరిగిన తొలి సమావేశంలో ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిసెంబర్ 3న (మొదటి మంగళవారం) స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తోంది.

అందులో భాగంగా ముందుగా డిసెంబర్ 1న ఆదివారం తిరుపతి మహతి ఆడిటోరియంలో, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఉదయం 5 గంటలకు టోకెన్లును జారీ చేయనున్నట్లు ప్రకటించింది, నిరంతరాయ వర్షాల కారణంగా ఈ తేదీని డిసెంబర్ 2 కు మార్పు చేస్తున్నట్లు టిటిడి ప్రకటించింది.

ఈ మేరకు తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు తమ ఆధార్ ఒరిజినల్ కార్డును చూపించి సదరు కేంద్రాలలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో టోకెన్లు పొందవచ్చని టిటిడి పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments