NEWSTELANGANA

కేటీఆర్ పై సృజ‌న్ రెడ్డి క్రిమిన‌ల్ పిటిష‌న్

Share it with your family & friends

నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేశార‌ని ఆరోప‌ణ

హైద‌రాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్‌పై నాంపల్లి స్పెషల్ కోర్ట్ లో క్రిమినల్ పిటిషన్ దాఖ‌లైంది.
కేటీఆర్‌పై క్రిమినల్ పిటిషన్ ఫైల్ చేశారు ప్ర‌ముఖ‌ వ్యాపారవేత్త సూదిని సృజన్ రెడ్డి . అమృత్‌ టెండర్లపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుండడంతో కోర్టుకు ఎక్కాన‌ని తెలిపారు .

ప్రజలను తప్పుదారి పట్టించేలా కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు సృజ‌న్ రెడ్డి. 2011లో శోధ కన్‌స్ట్రక్షన్స్ ప్రారంభ‌మైంద‌ని తెలిపారు . శోధ కన్‌స్ట్రక్షన్స్‌కు ఎండీగా కందాల దీప్తి రెడ్డి వ్యవరిస్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు.

ఆ సంస్థలో తనకు ఎలాంటి షేర్లు లేవని, తాను డైరెక్టర్‌ను కూడా కాదన్న సృజన్ రెడ్డి . శోధ కన్‌స్ట్రక్షన్స్‌తో తనను లింక్ చేస్తూ కేటీఆర్ అందర్నీ తప్పు దారి పట్టిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. అమృత్ 2లో ప్యాకేజ్‌ 1 కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న ఏఎంఆర్ -శోధ- ఐహెచ్ పీ జాయింట్ వెంచర్ క‌లిగి ఉన్నారంటూ పేర్కొన‌డం అబ‌ద్ద‌మ‌న్నారు సృజ‌న్ రెడ్డి.

జాయింట్ వెంచర్‌లో కేటీఆర్ చెబుతున్నట్లు శోధకు 80 శాతం కాకుండా 29 శాతమే వాటా ఉంద‌ని వెల్ల‌డించారు. అమృత్ పనులకు e-టెండర్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో టెండర్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నామ‌ని తెలిపారు.

పారదర్శకమైన విధానంలోనే టెండర్ల కేటాయింపు జరిగినా కేటీఆర్ నిరాధార‌మైన‌ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.

మాజీ మంత్రిగా కేటీఆర్‌కు టెండర్ల విధానంపై స్పష్టమైన అవగాహన ఉందని, కానీ కావాల‌ని త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించేలా విమ‌ర్శ‌లు చేయ‌డం స‌బ‌బు కాద‌న్నారు.