ఏప్రిల్ 2వ తేదీ వరకు ఎగ్జామ్స్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. విద్యా శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షలు మార్చి 21 నుంచి వచ్చే నెల ఏప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగుతాయి. పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు జరుగుతాయి. 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, 24న ఇంగ్లీష్ , 26న మ్యాథ్స్ , 28న ఫిజికల్ సైన్స్ , 29న బయోలాజికల్ సైన్స్ , ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగుతాయి.
ఇదే సమయంలో ఏప్రిల్ 3న ఒకేషనల్ కోర్సు పేపర్ -1 లాంగ్వేజ్, 4న ఒకేషనల్ కోర్సు , పేపర్ -2 లాంగ్వేజ్ పరీక్ష జరుగుతుంది. విద్యార్థులు నిర్దేశించిన సమయాని కంటే ముందే చేరుకోవాలి. సీసీటీవీ కెమెరాలతో పాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర డీజీపీ ప్రకటించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.
విద్యార్థులు తమ హాల్ టికెట్లను, అవసరమైన పరికరాలను ముందస్తుగా సిద్ధం చేసుకుని, పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకోవాలన్నారు.అన్ని పరీక్షా కేంద్రాలలో తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు విద్యార్థులకు పరీక్షలు బాగా రాయాలని కోరారు.