సింగపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
సింగపూర్ – సింగపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కీలక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. రూ. 3,500 కోట్ల పెట్టుబడులతో ఎస్టీ టెలీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్ ను హైద్రాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది.
ముచ్చర్ల సమీపంలోని మీర్‌ఖాన్‌పేటలో అత్యాధునిక వసతులతో క్యాంపస్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్బంగా సీఎం అభినందించారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకమైన పాత్ర పోషిస్తోంది. వేలాది మంది పాలిట శాపంగా మారింది. వందల మంది చేసే పనిని ఒక్క ఏఐ చేసి పెడుతోంది. దీంతో అన్ని కంపెనీలు ఇప్పుడు ఏఐ జపం చేస్తున్నాయి.
ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకైన దిగ్గజ కంపెనీలన్నీ ఏఐతో అనుసంధానం అవుతున్నాయి. లక్షలాది మంది నిపుణులను నియమించుకునే పనిలో పడ్డాయి. తాజాగా రేవంత్ రెడ్డి అధికారిక పర్యటన అంతా పూర్తిగా పెట్టుబడిదారులను ఆకర్షించడంలోనే మునిగి పోయింది. మొత్తంగా సీఎం టూర్ గత ప్రభుత్వం మాదిరిగానే ఉంది తప్పా కొత్తగా ఏమీ లేదన్న అపవాదు మూటగట్టుకున్నారు.