హెల్త్ కేర్ ఇన్నోవేషన్ పై స్టాన్ ఫోర్డ్ ఫోకస్
కంపెనీ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి భేటీ
అమెరికా – తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం అమెరికా పర్యటనలో బిజీగా ఉంది. శనివారం ప్రముఖ కంపెనీ స్టాన్ ఫోర్డ్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కంపెనీ కీలక ప్రకటన చేసింది. హెల్త్ కేర్ కు సంబంధించి ఇన్నోవేషన్ పై ఫోకస్ పెడతామని పేర్కొంది. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్కిల్స్ డెవలప్ మెంట్ యూనివర్శిటీలో కంపెనీ పరంగా భాగస్వామ్యం పంచుకునేందుకు ఆసక్తిని కనబర్చింది.
బైర్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్‌తో సమావేశం కావడం విశేషం. అంతే కాకుండా లైఫ్ సైన్సెస్ యూనివర్శిటీ కోసం భాగస్వామ్యం పంచుకుంటామని తెలిపారు. స్టాన్‌ఫోర్డ్ బయో-డిజైన్ ప్రక్రియను సమగ్ర పరచడం, జ్ఞాన మార్పిడి కార్యక్రమాలను అన్వేషించడం వంటి కీలక అంశాలు ఉన్నాయి.
అభివృద్ధి చెందుతున్న వైద్య పరికరాల పరిశ్రమకు తెలంగాణ నిబద్ధతను ఎత్తి చూపుతూ సహకరించడానికి ఆసక్తిని వ్యక్తం చేసింది. అభివృద్ధి చెందుతున్న ఆరోగ్య సంరక్షణ రంగం కోసం ఈ భాగస్వామ్యం యువతను కీలక నైపుణ్యాలతో సన్నద్ధం చేస్తుందని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.
స్టాన్ ఫోర్డ్ నైపుణ్యం వారి లక్ష్యాలతో సంపూర్ణంగా సరి పోతుందని, లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణకు బలమైన పర్యావరణ వ్యవస్థను వాగ్దానం చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.