సీఎం ను అభినందించిన ఎండీ
హైదరాబాద్ – రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డిని పరామర్శించేందుకు ప్రముఖులు బారులు కట్టారు. ఒకరి వెంట మరొకరు కలుస్తున్నారు. ఆయనకు అభినందనలు తెలియ చేస్తున్నారు. ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అపోలో ఆస్పత్రుల ఎండీ డాక్టర్ సంగీతా రెడ్డి కలుసుకోగా తాజాగా ఆమె బాటలోనే స్టార్ హెల్త్ గ్రూప్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ మన్నెం గోపీచంద్ కూడా భేటీ అయ్యారు.
ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డికి చాలా మంది ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. వ్యక్తిగత స్నేహం కూడా ఉంది. అంతే కాకుండా అన్ని పార్టీలు, వర్గాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలతో , యజమానులు, చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, సిఇఓలో సత్ సంబంధాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆరోగ్య రంగంలో కీలక మార్పులు తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్కరికీ పూర్తిగా హెల్త్ డిజిటల్ కార్డు ఉండాలని, ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఆదేశించారు సీఎం. దీనిని నిర్వహించేందుకు ఆయా ఆస్పత్రులు , సంస్థలు ముందుకు రావాలని కోరారు. ఈ సందర్బంగా మన్నెం గోపీ చంద్ ఆరోగ్య రంగానికి సంబంధించి చర్చలు జరిపారు.