త్వరలో స్టార్ లింక్ బ్రాడ్ బ్యాండ్
భారత దేశంలోకి వస్తుందన్న మస్క్
అమెరికా – భారతీయులకు మరింత ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పలు టెలికాం దిగ్గజ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇందులో ప్రధాన భూమిక పోషిస్తోంది ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ తో పాటు బీఎస్ఎన్ఎల్ – టాటా .
వీటితో పోటీ పడేందుకు సిద్దమయ్యారు ప్రపంచ కుబేరుడు , టెస్లా చైర్మన్ , ఎక్స్ అధిపతి, స్లార్ లింక్ ఫౌండర్ ఎలాన్ మస్క్. ఈ సందర్బంగా సంచలన ప్రకటన చేశాడు. త్వరలోనే భారత దేశంలో స్టార్ లింక్ బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుబాటులోకి తీసుకు వస్తామని అన్నాడు.
ఇందుకు సంబంధించి భారత ప్రభుత్వంతో తాము చర్చలు జరపనున్నట్లు వెల్లడించారు. దీంతో ఇండియాలో ఇప్పటికే అతి పెద్ద బ్యాండ్ విడ్త్ నెట్ వర్క్ కలిగి ఉన్న జియోకు బిగ్ ఎఫెక్ట్ పడనుందని సమాచారం.
ఎలోన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ భారతదేశానికి సంబంధించిన డేటా స్థానికీకరణ, భద్రతా అవసరాలను తీర్చడానికి అంగీకరించింది. దీంతో త్వరలోనే దేశ మంతటా బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు ఉన్న నెట్ వర్క్ లన్నీ కేబుల్స్ మీద ఆధారపడ్డాయి. కానీ స్టార్ లింక్ అలా కాదు..ఉపగ్రహం ద్వారా నేరుగా నెట్ కనెక్టివిటీ అందుబాటులోకి తీసుకు వస్తుంది. దీంతో టెక్నాలజీలో ఇదో అద్భుతమైన సన్నివేశంగా పేర్కొంటున్నారు టెలికాం నిపుణులు.