రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్
అమరావతి – రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, బాలికలు, యువతుల పట్ల ఎవరైనా అసభ్యకరంగా వ్యవహరించినా లేదా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా తాట తీస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ. సోమవారం మంగళగిరి లోని మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్ పర్సన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. తనపై నమ్మకం ఉంచి అత్యున్నతమైన పదవిని, అంతకు మించిన బాధ్యతలను అప్పగించినందుకు సీఎంకు, డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. మహిళ హక్కులు, సంక్షేమ సాధనకు తోడ్పడతానని స్పష్టం చేశారు రాయపాటి శైలజ.
మహిళల రక్షణ కోసం పాడుపడతానని చెప్పారు. గత 5 ఏళ్లలో మహిళ కమిషన్ తూతు మంత్రంగా వ్యవహరించిందని ఆరోపించారు. మహిళలకు తోడుగా నిలబడతానని అన్నారు . పార్టీలకు అతీతంగా అందరికి న్యాయం చేస్తామన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పారు , మహిళలకు గౌరవం తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. లేకపోతే తాట తీస్తామన్నారు. సోషల్ మీడియాను ఇష్టానుసారంగా ఉపయోగిస్తూ అడవారిపై తప్పుగా పోస్ట్ లు పెడుతున్నారని ఇక కుదరదని వార్నింగ్ ఇచ్చారు. పోస్ట్ లు పెడితే ఊరుకునేది లేదన్నారు.