టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమల – తిరుమలలో రథ సప్తమికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఏడు వాహనాలపై శ్రీ వేంకటేశ్వర స్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తారన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్ని సేవలను, ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సిఫార్సు లేఖలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవన్నారు బీఆర్ నాయుడు.
2 నుండి 3 లక్షల మంది భక్తులు ఆరోజు తిరుమలకు వస్తారని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని రథసప్తమి నాడు అన్ని సేవలను క్యాన్సిల్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్.
ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు తిరుపతిలో SSD టోకన్లు జారీ నిలిపి వేస్తున్నట్లు స్పష్టం చేశారు. 1250 మంది పోలీసులు, 1000 మంది రథసప్తమికి భద్రత కల్పించినట్లు వెల్లడించారు. భక్తుల మధ్య తోపులాట్లకు తావు లేకుండా ఆక్టోపస్, ఎన్.డి.ఆర్.ఎఫ్, ఏపిఎస్పీ, అగ్నిమాపక దళాలు పని చేస్తాయని చెప్పారు బీఆర్ నాయుడు.
వాహన సేవలను తిలకించేందుకు గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు నిర్విరామంగా అన్న పానీయాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పుష్పాలంకరణ, విద్యుత్ అలంకరణలతో తిరుమల ముస్తాబు చేస్తామన్నారు. రథ సప్తమి సందర్బంగా 8 లక్షల లడ్డూలు నిల్వ ఉంచినట్లు స్పష్టం చేశారు.
మహాకుంభామేళా ప్రయాగ్ రాజ్ లో టీటీడీ నమూనా ఆలయం అద్భుతంగా ఉందన్నారు. రోజుకు 10 వేల మంది భక్తులకు దర్శించు కుంటున్నారని తెలిపారు. తిరుమల తరహాలో అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నామని చెపపారు.