రేవంత్ రెడ్డికి సుద్దాల కితాబు
సీఎంకు రచయిత ధన్యవాదాలు
హైదరాబాద్ – ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. తమను గుర్తించినందుకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ తల్లిని చూస్తే తనకు కన్న తల్లి గుర్తుకు వస్తోందని చెప్పారు సుద్దాల అశోక్ తేజ. దివంగత ప్రజా యుద్ద నౌక గద్దర్ పేరుతో అవార్డు ఇవ్వడం మామూలు విషయం కాదన్నారు. ఈ ప్రకటన చేయడానికి దమ్ముండాలన్నారు. ఈ గట్స్ ఒక్క రేవంత్ రెడ్డి విషయంలో తాను చూశానని కొనియాడారు సుద్దాల అశోక్ తేజ.
అంతే కాదు గద్దర్ అవార్డుతో పాటు నవ రత్నాల పురస్కారమైనా ఎవరూ ఊహించ లేదని అన్నారు. అది జాతీయ అవార్డు కంటే గొప్పదని స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటులో విమర్శలు, ఆరోపణలు చేయడం మానుకుంటే మంచిదని హితవు పలికారు. తమకు తెలంగాణ పట్ల నిబద్దత ఉంటుందన్నారు.
ఇదిలా ఉండగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం అవుతోంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. రేవంత్ రెడ్డి సర్కార్ కావాలని తెలంగాణ ఉద్యమ ఆనవాళ్లు లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదని హెచ్చరిస్తున్నారు ఉద్యమకారులు.