NEWSNATIONAL

రాజ్య‌స‌భ‌కు సుధా మూర్తి నామినేట్

Share it with your family & friends

ప్ర‌క‌టించిన రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము

న్యూఢిల్లీ – రాజ్యసభకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా మూర్తిని నామినేట్ చేశారు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము. సామాజిక సేవ‌కురాలిగా, ర‌చ‌యిత్రిగా గుర్తింపు పొందారు. ఆమె అస‌లు పేరు నీ కుల‌క‌ర్ణి. క‌న్న‌డ‌, మ‌రాఠీ, ఆంగ్ల భాష‌ల‌లో ప‌ట్టు క‌లిగి ఉన్నారు. ఇంజ‌నీరింగ్ టీచ‌ర్ గా పేరు పొందారు. ఆమె అల్లుడే ప్ర‌స్తుత యుకె ప్ర‌ధాని రిషి సున‌క్.

సాయం చేయ‌డంలో, దాతృత్వ ప‌నుల్లో పేరొందారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్‌గా పని చేస్తున్నారు .ఇవాళ అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం. ఈ సంద‌ర్బంగా సుధా మూర్తికి కేంద్ర స‌ర్కార్ అరుదైన బ‌హుమానం అంద‌జేసింది.

సుధా మూర్తి ఆగస్టు 19, 1950న భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రం హావేరి లోని షిగ్గావ్‌లో పుట్టారు. ఆమె బీవీబీ నుండి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రురాలైంది. KLE టెక్నలాజికల్ యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యూయేష‌న్ పూర్తి చేశారు. అప్ప‌టి క‌ర్ణాట‌క సీఎం చేతుల మీదుగా బంగారు ప‌త‌కాన్ని అందుకున్నారు.

సుధా మూర్తి అప్పటి టెల్కో చైర్మన్‌కి పోస్ట్ కార్డ్ రాసి కంపెనీలో లింగ వివక్షపై ఫిర్యాదు చేశారు. భారతదేశపు అతిపెద్ద ఆటో తయారీదారు టాటా ఇంజనీరింగ్, లోకో మోటివ్ కంపెనీ (టెల్కో)లో నియమించబడిన మొదటి మహిళా ఇంజనీర్.

ఆమె మొదట పూణేలో డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా ప‌ని చేశారు. ముంబై, జంష‌డ్ పూర్ ల‌లో విధులు నిర్వ‌హించారు. వాల్‌చంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో సీనియర్ సిస్టమ్స్ అనలిస్ట్‌గా కూడా ప‌ని చేశారు..
1996 సంవత్సరంలో సుధా మూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌ను స్థాపించారు. బెంగుళూరు యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్ గా ప‌ని చేస్తున్నారు. ఆమె క్రైస్ట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా కూడా పని చేశారు.

ఆమెకు ఎన్నో అవార్డులు వ‌రించాయి. మ‌రెన్నో పుర‌స్కారాలు ద‌క్కాయి. సుధా మూర్తి చేసిన సేవ‌ల‌కు గాను భార‌త ప్ర‌భుత్వం ఎంపీగా ప్ర‌మోట్ చేసింది.