NEWSNATIONAL

కేజ్రీవాల్ ప‌చ్చి మోస‌గాడు

Share it with your family & friends

సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ కామెంట్

న్యూఢిల్లీ – మ‌నీ లాండ‌రింగ్ కేసులో అడ్డంగా బుక్కై ప్ర‌స్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభ‌విస్తున్న సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మొద‌టి నుంచీ ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసుకు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌చ్చారు. అంతే కాదు తీహార్ జైలుకు గ్రాండ్ వెల్ క‌మ్ చెబుతున్నానంటూ లేఖ రాశారు.

ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ప్రాంగ‌ణంలో మీడియాతో మాట్లాడారు సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్. ప‌చ్చి మోస‌గాడే కాదు అవ‌కాశ వాది అని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ పై . లిక్కర్ స్కామ్ కేసులో కోట్లు చేతులు మారాయాని, ఇందులో కీల‌క‌మైన పాత్ర పోషించారంటూ ఎమ్మ‌ల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌, కేజ్రీవాల్ అంటూ ఫైర్ అయ్యారు.

కేజ్రీవాల్ , ఆయ‌న బృందానికి వ్య‌తిరేకంగా అప్రూవ‌ర్ గా మారేందుకు సిద్దంగా ఉన్నాన‌ని స్పష్టం చేశారు. ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన ఘ‌న‌త సీఎం కేజ్రీవాల్ కు ద‌క్కుతుంద‌న్నారు. అత‌డికి శిక్ష ప‌డేంత వ‌ర‌కు తాను నిద్ర పోనంటూ శ‌ప‌థం చేశారు సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్.