పుష్ప-2 సక్సెస్ పక్కా – సుకుమార్
ధీమా వ్యక్తం చేసిన డైనమిక్ డైరెక్టర్
హైదరాబాద్ – మైత్రీ మూవీ మేకర్స్ సారథ్యంలో తాను తీసిన పుష్ప -2 ది రూల్ మూవీ తప్పకుండా సక్సెస్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మాస్టర్ డైరెక్టర్ సుకుమార్ . మంగళవారం ఆయన ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.
ఈ సందర్భంగా పుష్ప రాజ్ దుమ్ము రేపిందని, కానీ అంతకు మించి కలెక్షన్స్ రావడం ఖాయమని పేర్కొన్నారు సుకుమార్. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఇప్పటి వరకు కనీవిని ఎరుగని రీతిలో కలెక్షన్లసు కొల్లగొడుతోందన్నారు.
బాలీవుడ్ లో కేవలం 10 గంటల్లో 60 వేల టికెట్లు అమ్ముడు పోయాయని, దేశ వ్యాప్తంగా ఇదే టాక్ కొనసాగుతోందన్నారు. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా పుష్ప 2 ఇప్పటికే రికార్డ్ స్థాయిలో 12 వేల థియేటర్లలో విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు సుకుమార్. దేశ సినీ చరిత్రలో పుష్ప 2 ది రూల్ చిత్రం రికార్డులను తిరగ రాయడం తప్పదన్నారు.
మేకింగ్ లో ఎక్కడా రాజీ పడలేదన్నారు. ఇక బన్నీ నటన తారా స్థాయిలో ఉంటుందన్నారు. ఇదే సమయంలో కిస్సిక్ పాప శ్రీలీల, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పోటీ పడి నటించారని పేర్కొన్నారు డైరెక్టర్ సుకుమార్.