మోదీ సమర్థుడైన నేత
ప్రముఖ నటి సుమలత
బెంగళూరు – ప్రముఖ నటి , బీజేపీ నాయకురాలు సుమలత అంబరీష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. గత ఐదేళ్లలో మాండ్యా నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇదే సమయంలో సమర్థవంతుమైన నాయకుడిగా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన నరేంద్ర మోదీతో భేటీ కావడం తనకు మరింత ఆనందాన్ని కలుగ చేసిందన్నారు సుమలత.
మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నుండి అందిన మద్దతు, సహకారం మాటల్లో వర్ణించ లేనంటూ పేర్కొన్నారు. ఎన్నికల సందర్బంగా జరిగిన భారీ బహిరంగ సభలో తనకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపే అవకాశం లభించిందని తెలిపారు సుమలత అంబరీష్.
కావేరీ, చాముండేశ్వరి అమ్మవారి ఆశీర్వాదం ఉన్న మన పుణ్యభూమి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, మన మండ్య ప్రజలకు సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నానని స్పష్టం చేశారు. మన దేశ ప్రగతిని మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు మనందరం మోదీకి బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు సుమలత .