Sunday, April 20, 2025
HomeNEWSరూ. 45,500 కోట్ల‌తో స‌న్ పెట్రో కెమిక‌ల్స్ ఇన్వెస్ట్

రూ. 45,500 కోట్ల‌తో స‌న్ పెట్రో కెమిక‌ల్స్ ఇన్వెస్ట్

తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ తో భారీ ఒప్పందం

దావోస్ – దావోస్ వేదిక‌గా భారీ ఒప్పందం చేసుకుంది తెలంగాణ ప్ర‌భుత్వం. రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజ్ ప‌వ‌ర్, సోలార్ ప‌వ‌ర్ ప్రాజెక్టును చేప‌ట్ట‌నుంది స‌న్ మెట్రో కెమిక‌ల్స్ కంపెనీ. ఇందులో భాగంగా రూ. 45,500 కోట్లు పెట్టుబ‌డిగా పెట్ట‌నుంది. ఈ ఒప్పందంతో దాదాపు 7 వేల మందికి ఉపాధి అవ‌కాశాలు ద‌క్క‌నున్నాయి. రాష్ట్రంలోని నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ప్రాజెక్టులను నెలకొల్పనుంది సన్ పెట్రో కెమికల్స్.

ఇదిలా ఉండ‌గా దావోస్ లో ఫుల్ బిజీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. ఆయ‌న‌తో పాటు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు, ఐటీ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్ ప‌ర్య‌టిస్తున్నారు.

ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న స‌ద‌స్సులో వీరు పాల్గొంటున్నారు. నిన్న అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. ముగ్గురు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు చంద్ర‌బాబు నాయుడు, రేవంత్ రెడ్డి, దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ పాల్గొన్నారు. త‌మ త‌మ రాష్ట్రాలలో జ‌రుగుతున్న అభివృద్ది ప‌నుల గురించి వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments