తడ బడినా నిలబడ్డారు
సన్ రైజర్స్ సూపర్ షో
చెన్నై – కీలకమైన మ్యాచ్ లో సత్తా చాటుతూ తనకు ఎదురే లేదని నిరూపించింది ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్. టోర్నీలో తనతో తలపడిన ప్రతి జట్టుతో సూపర్ షో చేసింది. బ్యాటింగ్ లో చెలరేగింది. బౌలింగ్ తో కట్టడి చేసింది. హైదరాబాద్ జట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే.
ప్రధానంగా తాడో పేడో తేల్చు కోవాల్సిన సమయంలో సర్వ శక్తులు ప్రయోగించింది. ప్రధానంగా స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మలు అంచనాలకు మించి అద్భుతంగా బౌలింగ్ చేశారు. బలమైన రాజస్థాన్ రాయల్స్ జట్టును కట్టడి చేశారు.
షాబాజ్ అహ్మద్ 24 రన్స్ ఇచ్చి 3 వికెట్లు కూల్చితే అభిషేక్ 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. జట్టును నడిపించడంలో సక్సెస్ అయ్యాడు సన్ రైజర్స్ స్కిప్పర్ కమిన్స్. టాస్ ఓడి పోయి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఆది లోనే వికెట్లను కోల్పోయింది. క్లాసెన్ తో పాటు రాహుల్ త్రిపాఠి జట్టును ఆదుకున్నారు. గౌరవ ప్రదమైన స్కోర్ 176 పరుగులు చేసేలా కీలక పాత్ర పోషించారు.
బౌల్ట్ తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ ను 12 పరుగులకే వెనుదిరిగాడు. త్రిపాఠి అశ్విన్ 4వ ఓవర్లో 14 రన్స్ చేశాడు. ఇందులో 2 ఫోర్లు ఒక సిక్సర్ కొట్టాడు. మార్క్ రామ్ ఒక పరుగే చేశాడు. ట్రావిస్ హెడ్ 34 రన్స్ చేశాడు. సందీప్ శర్మ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. నితీశ్ రెడ్డి 5 రన్సే చేసి పెవిలియన్ బాట పట్టాడు.
ఒక దశలో 99 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న జట్టును క్లాసెన్ ఆదుకున్నాడు. సందీప్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.