తను కూడా బెస్ట్ ఆల్ రౌండర్
ముంబై – తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టెస్ట్ సీరీస్ లో నితీశ్ అద్భుతంగా ఆడుతున్నాడని కితాబు ఇచ్చాడు. ప్రధానంగా మెల్ బోర్న్ వేదికగా జరిగిన 4వ టెస్టు మ్యాచ్ లో సూపర్ సెంచరీ చేయడం తనను మరింతగా ఆకట్టుకుందని తెలిపారు. భవిష్యత్తులో తనకు కూడా బెస్ట్ ఆల్ రౌండర్ గా ఎదుగుతాడని జోష్యం చెప్పారు.
టెస్టు కెరీర్ లో తొలి సెంచరీ చేశాడు విశాఖపట్నం కు చెందిన నితీశ్ కుమార్ రెడ్డి. తను ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) లో అద్బుతంగా రాణించాడు. తనను ఏరికోరి సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తీసుకుంది.
అన్ని ఫార్మాట్ లలో తనకు రాణించాలని ఉందన్నాడు నితీశ్ కుమార్ రెడ్డి. భవిష్యత్తులో టెస్టు కెరీర్ లో కూడా తనను తాను ప్రూవ్ చేసుకుంటాడని మాజీ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్. ఇదే సమయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు సీనియర్ క్రికెటర్లు సైతం ప్రశంసలు కురిపించారు నితీశ్ కుమార్ రెడ్డి.