ఆప్ ను ఆపే దమ్ము లేదు
సునీతా కేజ్రీవాల్ కామెంట్స్
న్యూఢిల్లీ – ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడును తట్టుకునే దమ్ము భారతీయ జనతా పార్టీకి లేదని స్పష్టం చేశారు సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం తూర్పు ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి రోడ్ షోలో ప్రసంగించారు.
భారతీయ జనతా పార్టీని ఏకి పారేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేవలం కక్ష సాధింపు ధోరణితోనే చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. కావాలని తన భర్త కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయించారంటూ ధ్వజమెత్తారు.
ఇవాళ ఆప్ రోడ్ షో సందర్బంగా వచ్చిన జనాదరణను చూస్తే షాక్ తప్పదన్నారు. ప్రజలు పూర్తిగా తమ వైపు ఉన్నారని దీనిని బట్టి తెలుస్తుందన్నారు. ఢిల్లీ వాసులు తమ భావోద్వేగాల్లో గానీ, తమ ప్రేమలో గానీ తగ్గడం లేదని చెప్పకనే చెప్పారని పేర్కొన్నారు సునీతా కేజ్రీవాల్.
ఈసారి ఎన్నికల్లో ఆప్ కూటమికి ఘన విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు. అకారణంగా వేధింపులకు గురి చేస్తున్న కేంద్ర సర్కార్ కు షాక్ ఇవ్వాలని పిలుపునిచ్చారు .