9 నెలల తర్వాత భూమి మీదకు
అమెరికా – భారత దేశానికి చెందిన ప్రముఖ వ్యోమోగామి సునీతా విలియమ్స్ తో పాటు బుచ్ విల్మోర్ 9 నెలల అనంతరం భూమి మీదుకు క్షేమంగా చేరుకున్నారు. ఇటు భారత్ తో పాటు అమెరికా ప్రజలు ఎంతో ఉత్కంఠతో వీరి రాక కోసం ఎదురు చూశారు. నాసా వ్యోమగాములు, తోటి అమెరికన్ నిక్ హేగ్ , రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్‌లతో కలిసి బుధవారం అర్ధరాత్రి 3.27 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్, ఫ్రీడమ్ , భూమి వాతావరణం గుండా దూసుకు వెళ్లి 1650 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకుని తల్లాహస్సీ సమీపంలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో పారా చూట్ ద్వారా దిగారు.
బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్ గత సంవత్సరం జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి క్లుప్త పరీక్షా విమానంలో బయలుదేరారు . సిబ్బంది కార్యకలాపాలకు అంతరిక్ష నౌక భద్రతను ధృవీకరించడానికి 8 రోజుల పాటు మిషన్ కొనసాగింది.. అయితే, ప్రొపల్షన్ లోపాలు అంతరిక్ష నౌకను ఖాళీగా తిరిగి రావలసి వచ్చింది, వ్యోమగాములు ఊహించని విధంగా అంతరిక్షంలో చిక్కుకున్నారు.రెస్క్యూ మిషన్‌కు తొందర పడకుండా నాసా గత సెప్టెంబర్‌లో ISSకి చేరుకున్న స్పేస్ ఎక్స్ క్రూ-9 మిషన్‌కు ఆ జంటను తిరిగి కేటాయించింది. దీంతో క్షేమంగా వ్యోమగాములు చేరుకునేలా చేయడంలో సక్సెస్ అయ్యారు.