9 నెలలుగా అంతరిక్షంలోనే వ్యోమగాములు
అమెరికా – అంతరిక్షం నుంచి వ్యోమగాములు తిరుగు ప్రయాణం అయ్యారు. మార్చి 19వ తేదీ బుధవారం భూమి మీదకు రానున్నారు భారత దేశానికి చెందిన వ్యోమోగామి సునీతా విలియమ్స్. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.27 గంటలకు ల్యాండింగ్ కానుంది. ఫ్లోరిడా తీరంలో దిగనుంది క్రూ డ్రాగన్ వ్యోమ నౌక. ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమై ఉంది స్పేస్ ఎక్స్ వ్యోమనౌక. గత 9 నెలలుగా అంతరిక్షంలోనే ఉన్నారు సునీతా విలియమ్స్, విల్మోర్. కేంద్ర సర్కార్ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది ఆమె కోసం. నాసా మాజీ వ్యోమగామి లెరోయ్ చియావో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
సునీతా విలియమ్స్, విల్మర్ తిరిగి ఇక్కడికి వచ్చాక నడిచేందుకు తీవ్ర ఇబ్బంది పడే ప్రమాదం ఉందన్నారు. కాగా భూమి మీదకు వచ్చాక ఈ ఇద్దరు వ్యోమగాములు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడనున్నట్లు వైద్యులు తెలిపారు. ఎముకల సాంధ్రత తగ్గడం, పాదాలు ఇబ్బంది పెట్టడం, ఇతర సమస్యలు వారిని పీడించే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. వారి రాక గురించి పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు ఇటు భారతీయులు, అటు అమెరికన్లు. ఇద్దరు వ్యోమగాములు బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో ISSకి చేరుకున్నారు, కానీ అంతరిక్ష నౌక యొక్క సాంకేతిక భద్రత చుట్టూ ఉన్న ఆందోళనల కారణంగా తిరిగి రాలేక పోయారు.