రూ. 10 కోట్లకు మహమ్మద్ షమీ
తీసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్
జెడ్డా – ఇండియన్ ప్రిమీయర్ లీగ్ వేలం పాట 2025కు సంబంధించి మొదలైంది. భారీ ఎత్తున కొనసాగుతోంది . మొత్తం 10 ఫ్రాంచైజీలు ఇందులో పాల్గొంటున్నాయి. అత్యధిక ధరకు అమ్ముడు పోయాడు ఇండియన్ క్రికెటర్ , మాజీ ఢిల్లీ క్యాపిటల్స్ స్కిప్పర్ రిషబ్ పంత్. ఏకంగా ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డ్ సృష్టించాడు. తనను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లు పెట్టి తీసుకుంది. ఇది అందరినీ విస్తు పోయేలా చేసింది.
ఇక సూపర్ ఫాస్ట్ బౌలర్ గా ఇప్పటికే పేరు పొందిన కోల్ కతా కు చెందిన మహమ్మద్ షమీని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం రూ. 10 కోట్లకు తీసుకుంది. బౌలింగ్ పరంగా మరింత బలం పెంచుకునేందుకు ఎస్ఆర్హెచ్ సీఈవో కావ్య మారన్ ఫోకస్ పెట్టింది.
ఇదిలా ఉండగా లక్నో సూపర్ జెయింట్స్ డేవిడ్ మిల్లర్ ను రూ. 7.50 కోట్లకు కైవసం చేసుకుంది. ఇది కూడా భారీ మొత్తమే. మొత్తంగా పంట పండుతోంది ప్లేయర్లకు. ఈ వేలం పాటలో ఇవాళ కీలకమైన ఆటగాళ్లను తీసుకోనున్నాయి ఫ్రాంచైజీలు.